సెయింట్ మార్క్స్ సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

Spread the love

సెయింట్ మార్క్స్ సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు……

పట్టణంలో సండే స్కూల్ చిన్నారులతో ర్యాలీ..

మట్టల ఆదివారం సందేశాన్ని వినిపించిన రెవరెండ్ పిల్లి దేవదాసు…

చీరాల,బాపట్ల జిల్లా,

ప్రతీ ఒక్కరు క్రీస్తు మార్గంలో పయనించి ప్రేమ,దయ,కరుణ కలిగి శాంతి మార్గంలో పయనించాలని తెలిపారు.
క్రైస్తవసోదరి,సోదరులు,సండే స్కూల్ చిన్నారులతో,సంఘ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారాన్ని నిర్వహించారు.మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని క్రైస్తవ దేవాలయాలు పండగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని పలు దేవాలయాల్లో క్రైస్తవ సోదరి,సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా చీరాల పట్టణ పరిధిలోని సెయింట్ మార్క్స్ సెంటినరీ దేవాలయం ఆధ్వర్యంలో సండే స్కూల్ చిన్నారులు మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని చర్చి వద్ద నుంచి పట్టణంలో మజీద్ సెంటర్
,మార్కెట్ సెంటర్,మండల కార్యాలయం ,గడియార స్తంభం మీదుగా పేరాల మరియు చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో సండే స్కూల్ చిన్నారులు, సండే స్కూల్ టీచర్స్ ర్యాలీలో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింప బడునుగాక,జై యేసు మహారాజు కే జయము,బోలో యేసు రాజుకి జయము జయము అంటూ దేవుని స్తుతిస్తూ క్రైస్తవ గీతాలు అలపిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి సంఘ కాపరి జోసెఫ్ కెరీ,రెవరెండ్ దేవదాసు లు దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకరక్షకునిగా జన్మించి మానవుల రక్షణ కొరకు ఈ లోకమునకు దైవ స్వరూపునిగా వచ్చారని,మానవుల పాప పరిహార్ధనకై శిలువలో మరణించి,తిరిగి మూడవ దినమున సజీవునిగా తిరిగి లేచారని తెలిపారు. యేసు క్రీస్తు జీవించిన కాలంలో క్రీస్తును గాడిద మీద ఎక్కించి మట్టలు చేత భూని దావీదు కుమారునికి జయము జయము అంటూ నినదిస్తూ ఊరేగింపుగా ముందుకు సాగారని, క్రీస్తు పుట్టుక సర్వ మానవాళి కి రక్షణ దినంగా ఉందని,అందుకే క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహిస్తారని, గుడ్ ఫ్రెడే రోజున క్రీస్తును సిలువ వేసిన రోజును మంచి శుక్రవారంగా అత్యంత భక్తి శ్రద్ధలతో క్రీస్తు సిలువ లో మరణించి రోజును నిర్వహించి మరలా క్రీస్తు మూడవ దినమున తిరిగి లేచిన రోజును ఇస్టర్ పర్వదినాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు అందరూ ఏసుక్రీస్తు మార్గంలో పయనించి ప్రేమ , శాంతి సమాధానం కలిగి ఉండాలని సూచించారు.అనంతరం సండే స్కూల్ విద్యార్థులు, చిన్నారులు అత్యంత అందంగా అలంకరించిన మట్టల ఎంతగానో అకర్షించాయి, అందంగా అలంకరించిన వాటికి బహుమతులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలోసెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి సండే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు,చిన్నారులు, సండే స్కూల్ సిబ్బంది మరియు పిసిసి, ఎల్ సీసీ సభ్యులు చీరాల పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి చైర్మన్
దేటా అశోక్,ట్రెజరర్ ఏరిచర్ల రమేష్,పోస్టర్స్ రెవరెండ్ జోసఫ్ కెరీ,రెవరెండ్ పిల్లి దేవదాసు,పేతురు బాబు,దేటా దివాకర్, అజయ్,సుధీర్,మోహన్ రావు,బజ్జిబాబు,సతీష్,గట్టుపల్లి ప్రేమ్ కుమార్,దేటా రవికుమార్, భాస్కర్ రావు,
శాంతయ్య,రోహిణి,సందీప్,
బొనిగల ప్రకాష్,సండే స్కూల్ టీచర్స్,ధన్రాజ్,సండే స్కూల్ విద్యార్థులు, చిన్నారులు,యూత్ ,స్త్రీల సమాజం, చర్చి సంఘ సభ్యులు,చర్చి పెద్దలు,ప్రజలు, క్రైస్తవ సోదరి,సోదరులు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page