శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవాలు
చిట్యాల (సాక్షిత ప్రతినిధి )
చిట్యాల మండలం నేరడ గ్రామంలో 56వ శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవములు ఘనంగా జరిగాయి. ఉగాది నుండి ప్రారంభమై శ్రీరామనవమి రోజు తో ముగిశాయి. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల 56వ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా యాజ్ఞకులు మరింగంటి రామచంద్రచార్యులు కోదాడ అర్చకులు శ్రీరంగం పాండురంగాచార్యుల వేదమంత్రాలతో భక్తుల కరతాల ధ్వనులతో శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు హరే కృష్ణ కల్చరల్ సొసైటీ హరే కృష్ణ భగవాన్ నామ సంకీర్తనలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక శోభ వెంకట్ రెడ్డి,వైస్ ఎంపీపీ మర్ల అలివేలు రామ్ రెడ్డి, గ్రామ నాయకులు దుబ్బాక అమరేందర్ రెడ్డి (ఎన్నారై ), హైదరాబాద్ వాస్తవ్యులు మోదుగు ప్రభాకర్ రెడ్డి అనిత దంపతులు పాల్గొన్నారు దాతల ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నప్రసాదని వితరణ నిర్వహించడం జరిగినది స్వామివారు రథోత్సవం పై ఊరేగింపు భగవాన్ సంకీర్తనలతో మహిళల కోలాటాలతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాక చైర్మన్ పాపని జనార్ధన్ భక్త బృందం అధ్యక్షులు ముషం రామస్వామి ఉపాధ్యక్షులు గుర్రం బిక్షపతి ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి లక్ష్మయ్య సంయుక్త కార్యదర్శి ముషం శ్రీనివాస్ కేబుల్ టీవీ కోశాధిపతి ఆనందం కృష్ణయ్య పాల్గొన్నారు