రాష్ట్ర సెక్రటరీ జనరల్ హరి ఆశోక్ కుమార్. జగిత్యాల:శ్రీరామ నవమి పండుగను మున్నూరు కాపుల దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం సెక్రెటరీ జనరల్ హరి ఆశోక్ కుమార్,మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే దశరథం లు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వాడలో మంగళవారం హరి నర్సయ్య పటేల్,పుప్పాల నారాయణ పటెండ్ల స్మారక భవన్ సమావేశ మందిరంలో వారు మున్నూరు కాపుల శుభ దినోత్సవం పౌరాణిక,చారిత్రక విశేషాలను సంఘాల ప్రతినిధులకు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం త్రేతాయుగం,ద్వాపర యుగాల నుంచి తమ కుల మూల పురుషుడు జనక మహారాజు కూతురు అయిన సీతాదేవి కళ్యాణము రోజును మున్నూరు కాపుల దినోత్సవంగా జరుపుకున్నారనే విషయంలో పౌరాణిక,చారిత్రక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17 బుధవారం సంఘము తరపున సంఘానికి సేవలు అందించిన,అందిస్తున్న మున్నూరు కాపు సోదర,సోదరీమణులను ఘనంగా సన్మానించాలన్నారు.మున్నూరు కాపులను బీ సి ఏ గ్రూప్ లో చేర్చాలని బి సి.కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన రావు కు తగు కారణాలతో వినతిపత్రం సమర్పించామన్నారు.మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్,కృషి చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
భద్రాచలం లో జరిగే సీతారాముల కళ్యాణముకు తమ రాష్ట్ర సంఘము తరపున స్వామి వారికి ముత్యాల తలంబ్రాలను,పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు.జై శ్రీరాం అంటూ శ్రీరామ నామ స్మరణ చేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే మహేందర్,మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పుప్పాల గంగాధర్,యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి విజయ్,ప్రధాన కార్యదర్శి క్యాస రఘునందన్ రెడ్డి,లీగల్ సెల్ అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల నర్సింగరావు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు పుప్పాల విజయ, ప్రధాన కార్యదర్శి గంగం జలజ,జిల్లా నాయకులు తాడెపు రమణ పుప్పాల కిషోర్ కుమార్,రాపల్లి గంగన్న, లైసెట్టి వెంకటి,కొండెంగారి శ్రీదర్,పి.సి.హన్మంత్ రెడ్డి, వొజ్జలబుచ్చిరెడ్డి,సౌడాల కమలాకర్ , భూతం ఆనంద్ వొడ్నల జగన్ , నెల్ల రాజేశ్వర్ రెడ్డి, చిందం మనోహర్ పటేల్ , మారిశెట్టి ఆశోక్, దిండిగాల విట్టల్, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.