స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి
సాక్షిత జూలూరుపాడు: మండలంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ లో ఏడో తరగతి విద్యను అభ్యసిస్తున్న మందరికల రాంచరణ్ కు కిన్నెరసాని మొడల్ స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించటం జరిగింది జూలూరుపాడు ఎస్సై పోటు గణేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధమిక విద్యలో చూసి చదవగలగి చూడకుండా రాయగలిగేటట్లు విద్యార్థులను తయారు చేయ గలిగితే వారిలో విద్యా పై ఆసక్తి కలిగి విద్యలో రాణించగలరని, అదే విధంగా తల్లిదండ్రులు మొబైల్ ఫోన్స్ ఇవ్వకుండా బాగా చదివి ఉన్నత అభివృద్ధి లోకి రావాలని ఆకాక్షించారు. ఈ సందర్బంగా హలవత్ నరసింహరావు సీనియర్ ఇంజనీరింగ్ లెక్చరర్ మాట్లాడుతూ నవోదయ స్పోర్ట్స్ స్కూల్స్ లో మారుమూల పల్లెల్లో ఉన్న విద్యార్థులు సీట్లు సాధించటం గొప్ప విషయం అని ఆయన అన్నారు ఇలాంటి స్కూల్స్ లో సీట్లు సాధించేటట్లు కోచింగ్ ఇస్తున్న సాయి ఎక్సలెంట్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సాయి ఎక్సలెంట్ ప్రిన్సిపాల్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గురుకులంలో ఎనభై మందికి మరియు నవోదయ లో ముగ్గురు విద్యార్థులకు మరియు స్పోర్ట్స్ స్కూల్ లో ఒకరు సీట్లు సాధించగలిగి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు మా స్కూల్ మీద నమ్మకం తో పంపించిన తల్లిదండ్రులకు వారి ఆశయాలకు అనుగుణంగా విద్యను అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏఎస్సై తిరుపతిరావు మాజీ సర్పంచ్ వాంకుడోత్ వెంకన్న ఉపాధ్యాయ బృందం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి
Related Posts
లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
SAKSHITHA NEWS లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…