శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

Spread the love

శ్రీశైల దేవస్థానం సాక్షిత:లోక కల్యాణం కోసం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం శనివారం ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి
విశేషపూజలను నిర్వహించారు
ప్రతి మంగళవారం మరియు కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి
విశేష అభిషేకం మరియు పూజాదికాల దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) కుమారస్వామి వారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ,
వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయని
సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి.
తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని
చెప్పబడుతోంది ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతివైపరీత్యాలు
సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగుండాలని, పాడి సమృద్ధిగా
ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో
అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ
సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది.
అనంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్రము
పారాయణలు చేయబడ్డాయి.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనె, నెయ్యి,
కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమలా, ద్రాక్ష, అరటి మొదలైన వాటితో అభిషేక
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page