సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
…..
సాక్షిత సూర్యాపేట: సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట్ నరసింహ రెడ్డి భవన్ లో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం వెనుకబడడానికి ప్రధాన కారణం విద్య అని గుర్తించి ఆ విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమవుతుందని నమ్మిన మహాత్మ జ్యోతిరావు పూలే స్త్రీల విద్య కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పి దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా తీర్చిదిద్ది సమాజానికి విద్య అందేలా కృషిచేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అన్నారు. అనాధ పిల్లల కోసం, అంటరాని వారికోసం అనేక ఆశ్రమ పాఠశలు ఏర్పాటుచేసి ఎంతోమందికి విద్యాదానం చేశారని అన్నారు. ముఖ్యంగా ప్లేగు వ్యాధికి గురైన వారికి వైద్య సహాయాన్ని అందించారని గుర్తు చేశారు.
దేశఅభివృద్ధికి ఆటంకంగా ఉన్న సాంఘిక దురాచారాలైన వరకట్నం వేధింపులు, సతీసాగమనం, బాల్యవివాహాలు, స్త్రీల పట్ల చిన్నచూపు కు వ్యతిరేకంగా అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. దేశంలోని మొట్టమొదట మహాత్మా బిరుదు కలిగిన మహా నాయకుడు జ్యోతిరావుపూలే అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్,పులుసు సత్యం,కొప్పుల రజిత, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, ప్రజాసంఘాల నాయకులు కోడి ఎల్లయ్య, వెలుగు మధు చేగువేరా,సాంబయ్య, నెమ్మాది మనోజ్ తదితరులు పాల్గొన్నారు.