సాక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్
గొప్ప సంఘసంస్కర్త మానవతా వాది జ్యోతి రావుపూలే అని ఎంపీపీ
మంచి కంటి వెంకటేశ్వర్లు అన్నారు.మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా గుర్రంపోడు లోని ఎంపీడీవో కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా
ఎంపీపీ కంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అణచివేత, కుల వివక్షత, అంటరానితనం, పౌరహక్కుల వినియోగము మొదలగు వాటి సాధనకై పోరాడి కోట్లాది ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి స్త్రీ సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయులు, స్త్రీల అభివృద్దే సమాజాభివృద్ది గా భావించి స్త్రీ విద్యకు కృషి చేసిన దార్శనికులు సంఘసంస్కర్త మహిళోద్ధారకుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సామల బోజ్జయ్య, మండల సీనియర్ నాయకులు తరి వెంకటయ్య, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు
సంఘసంస్కర్త జ్యోతి రావుపూలే – ఎంపీపీ
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…