సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పెరియార్ పోరాటం స్ఫూర్తిదాయకం

Sakshitha news

సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పెరియార్ పోరాటం స్ఫూర్తిదాయకం….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, చెన్నై// : సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన, మహిళలకు సమాన హక్కులు, వితంతు స్త్రీల పునర్వివాహాల కోసం అహర్నిశలు కృషి చేసిన పెరియార్ ఈ.వీ. రామస్వామి గొప్ప మానవతావాది అని సీనియర్ జర్నలిస్టు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు.

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పెరియార్ ఈ.వీ. రామస్వామి నాయకర్ స్మారక సమాధిని ఆయన సందర్శించి ఘన నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి పెరియార్ సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా బొంకూరి మధు మాట్లాడుతూ సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పెరియార్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉద్యమం నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పెరియార్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పెరియార్ సమాజానికి చేసిన సేవలు, ఆశయాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు.

Scroll to Top