అక్టోబర్ 28న క్రోసూరులో స్కిల్ డెవలప్ మెంట్ మెగా జాబ్ మేళా
పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో క్రోసూరులో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నట్టు పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు పేర్కొన్నారు. గుంటూరులోని ఎమ్మెల్యే నివాసంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. అక్టోబర్ 28న క్రోసూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
జాబ్ మేళాలో సుమారు 15 కంపెనీలు.. 500కు పైగా ఉద్యోగాల కోసం ఇంటర్వూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చదివన వారు జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యులకు హాజరు కావాలని సూచించారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, , హెటెరో డ్రగ్స్, స్కిల్ క్రాఫ్ట్, మదర్సన్ సుమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యొకోహమా, జయలక్ష్మీ ఆటోమోటివ్స్ వంటి కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నట్టు తెలిపారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో DSDO కె. సంజీవరావు, ADSDO రామాంజనేయులు, DPO రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.