అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ఎల్వోసీ అందజేసిన మంత్రి కొప్పుల

అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ఎల్వోసీ అందజేసిన మంత్రి కొప్పుల

SAKSHITHA NEWS

అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ఎల్వోసీ అందజేసిన మంత్రి కొప్పుల

సాక్షిత : హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు గాను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్వోసీ అందజేశారు.*

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ కార్యకర్త లచ్చయ్య గత ఆరు రోజులు క్రితం రోడ్డు ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడగా వారిని స్వయంగా *సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ * నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని లచ్చయ్య చికిత్స కోసం 2 లక్షలు రూపాయలు, అదే గ్రామానికి అబ్దుల్ సమ్మద్ కొడుకు మెహరాజ్ అనారోగ్యంతో నిమ్స్ చేరగా వారి చికిత్స కోసం 3 లక్షల రూపాయల ఎల్.ఓ.సి లను మంజూరు చేయించి ఇందుకు సంబంధించి, పత్రాలను మంత్రి కొప్పుల శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల కి లబ్దిదారు కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన చిల్వకోడూర్ PACS చైర్మన్ వెంకట మాధవ రావు .


SAKSHITHA NEWS