శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం
సాక్షిత, తిరుపతి: స్థానిక వి.వి.మహల్ రోడ్డులోని “శుభమస్తు” షాపింగ్ మాల్ లో “పెళ్లితంతు బొమ్మల కొలువు” పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్ టీయుసీ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. పెండ్లి తంతు కొలువు చూతము రారండి అత్యద్భుతంగా పెట్టారని నవీన్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పెళ్లి తంతు బొమ్మల కొలువు స్టాల్ కు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా
తిరుమల శ్రీవారి పాదాల చెంత వున్న తిరుపతి ఆధ్యాత్మిక నగరం ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా శుభకార్యాలతో, మంగళ వాయిద్యాలతో, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని శుభమస్తు పెళ్లి తంతు బొమ్మల కొలువు నగర ప్రజలను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
హిందూ సనాతన ధర్మంలో “పెండ్లి” అన్న పదానికి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉందనీ, అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాల వారికి అందించాలనే లక్ష్యంతో శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెండ్లి సందర్భంగా జరిగే వివిధ అపురూపమైన కార్యక్రమాలను బొమ్మల కొలువు రూపంలో కళ్ళకు కట్టినట్లు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాల వస్త్రాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం కూడా అభినందనీయం అన్నారు. “మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హేవెన్” అనే అనుభూతిని తిరుపతి నగర ప్రజలకు బొమ్మల కొలువు రూపంలో అందిస్తున్న శుభమస్తు యాజమాన్యాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పీఎమ్ఆర్ ప్లాజా అధినేత్రి ప్రతిమా రెడ్డి, షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.
శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం
Related Posts
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
SAKSHITHA NEWS విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . SAKSHITHA NEWS
పుట్టపర్తిలో ఐటిమంత్రి నారా లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలుకుదాం
SAKSHITHA NEWS పుట్టపర్తిలో ఐటిమంత్రి నారా లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలుకుదాం పుట్టపర్తి నియోజవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు నియోజవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి…