
శ్రీరాముని స్పూర్తితో ఉన్నత విలువలకు కట్టుబడాలి
శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మండలనేని చరణ్‌తేజ
చిలకలూరిపేట:
ఈ శ్రీరామనవమి ప్రతి ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని, శ్రీరామ చంద్రమూర్తి దయ అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్‌తేజ ప్రజలకు, జనసైనికులకు, వీర మహిళలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఆ రాముడిని స్ఫూర్తిగా భావించి ఉన్నత విలువలకు కట్టుబడి ఉండాలని ఆకాంక్షించారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారన్నారని, శ్రీరాముడి అనుగ్రహంతో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు సుభిక్షంగా నిలవాలని ఆకాంక్షించారు.
