వైభవముగా జరిగిన శ్రీ మహా కాలభైరవ రక్షక యాగం
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నందు వెలసియున్న కరకంటేశ్వర స్వామీ ఆలయం లో నున్న శ్రీ కాలభైరవ స్వామి కి అత్యంత వైభవముగా మహా కాల రక్షక యాగం జరిగింది
ఉదయం ప్రారంభమైన యాగశాలలో 25 మంది దంపతులు సతీసమేతముగా పాల్గొని యాగ కార్యక్రమమును వీక్షించారు
తదుపరి శ్రీ కాలభైరవ స్వామి కి విశేషమైన అభిషేకము పాలు ,పెరుగు ,తేన. ఎలనీరు. పసుపు చందనము, విభూది. పన్నీరు మొదలుగా సుగంధ ద్రవ్యములతో అతి వైభవముగా అభిషేకము జరిగినది.
విశేష శుక్రవార అష్టమి పర్వదినాన ఉత్సవం మూర్తికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉభయ దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
పూజల అనంతరము విచ్చేసిన భక్తులందరికీ సుమారు 300 మందికి పైగా భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు
వడమాల పుష్పాలంకృతులైన శ్రీ భైరవ స్వామి అలంకరణ విశేషంగా ఆకర్షించాయి
ఈ కార్యక్రమంలో వేద గురుకులు నవీన్ గారు ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ,గురు స్వామి గురుకుల్. సుందరాచార్యులు, నిర్వాహకులు .కమిటీ సభ్యులు పాల్గొన్నారు