Should be aware of laws
చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి
సాక్షిత కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సైలు మరియు సిఐలు వారి సిబ్బంది కలిసి 2023 సంవత్సరంలో , 26 ఫిబ్రవరి వ తేదీల లో స్కూల్స్ మరియు కాలేజీలలో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా యువతి యువకులు మొబైల్ అప్లికేషన్స్ అయినటువంటి వాట్సప్, ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ వంటి వాటిని విరివిగా వాడుతున్నారు.వాటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అలా లేనియెడల వారికి తెలియకుండానే వారిపైన కేసులు నమోదు చేయబడుతున్నాయి. అది ఎలాగంటే ఎవరైనా వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా చైల్డ్ ప్రోనోగ్రఫీకి సంబంధించి అసభ్యమైనటువంటి వీడియోలను గాని, ఫోటోలను గాని ట్రాన్స్మిట్ చేసినట్లయితే వారి పైన నిఘా ఉంచి 67 బి ఐ టి ఆక్ట్ కింద కేసులు నమోదు చేయబడుతున్నాయి.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 212 కేసుల్లో సుమారు 8,400 మంది పైన సైబర్ ట్రిప్ లైన్ రిపోర్ట్స్ ద్వారా కేసులు నమోదు చేయబడినాయి .
అదేవిధంగా కర్నూలు జిల్లా పరిధిలో సుమారు 120 మంది మీద కేసులు నమోదు చేయబడినాయి. చాలామంది అమాయకులు తెలిసి తెలియక ఈ సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్స్ లో చిక్కుకుంటున్నారు.దీనిపైన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా యువతీ యువకులు అదేవిధంగా చిన్నపిల్లలు మొబైల్ అప్లికేషన్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు అవగాహన కలిగించారు.దిశా డి.ఎస్.పి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో సీఐలు కళా వెంకటరమణ, లక్ష్మయ్య లు పర్యవేక్షించారు.