శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లోని శ్రీ తుల్జాభవాని దేవస్థానం ఆలయ నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం
సాక్షిత : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీ తుల్జాభవాని దేవస్థానం కు ఎన్నుకోబడిన ఛైర్మెన్ మరియు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని , కార్యవర్గ సభ్యులు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని, దేవస్థానంలో మంచి ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కలిగేలా చూడలని , దేవుడికి భక్తులకు మధ్య సేవ చేసేలా అవకాశం వచ్చింది అని, ఇట్టి అవకాశం ను సద్వినియోగం చేసుకుంటూ దైవ సేవలో, నిమగ్నం కావాలని , భక్తులకు, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కలిపిస్తూ దివ్య దర్శనం జరిగేలా చూడలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తుల్జాభవాని దేవస్థానం ఛైర్మెన్ మల్లికార్జున శర్మ ఆలయ కమిటీ మెంబెర్స్ గోవిందా చారి ,రాజేంద్ర కుమార్, తివారి,విజయ లక్ష్మి, కృష్ణ యాదవ్ ,సంపత్ గుప్త ,మహేష్ గుప్త,మరియు శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన
రాజుయదవ్ తెరాస నాయకులు పద్మారావు ,
పొడుగు రాంబాబు, రమేష్, నటరాజ్ , సంజీవ్ రెడ్డి, రవి యాదవ్, గోపి కృష్ణ, కవిత తదితరులు పాల్గొన్నారు.