SAKSHITHA NEWS

ఎడ్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి కేకు కోసి పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ తాత పండుగ గేయాలు పాడారు. పాస్టర్ ఏసురత్నం క్రీస్తు సందేశం వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో హేమలతాదేవి, ఈవోపీఅర్డ్ షేక్ జాకీర్ హుస్సేన్, పి దయాసాగర్, ఉపాధి హామీ పథకం టి ఏ మాధవి, పంచాయతీ కార్యదర్శి శశికళ, ఏవో సాయి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు