SAKSHITHA NEWS

ఆగష్టు 21 నుంచి ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన
-తూర్పు పశ్చిమ గోదావరీ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా రూపకల్పన
-రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు

రాజమహేంద్రవరం, సాక్షిత:
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకూ ఇంటింటి ఓటరు గుర్తింపు, వత్యాసాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు పరిశీలన , సిఫార్సు, ఓటరు ఫోటో గుర్తింపు, తప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ 2025 పై, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా పై రాజకీయా పార్టీల ప్రతినిధులతో జిల్లా రెవెన్యు అధికారి నరసింహులుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు మాట్లాడుతూ, హేతుబద్ధత కలిగి ఉండేలా ఓటరు జాబితా, పోలింగు కేంద్రాల మార్పులు చేర్పులు చేపట్టే దిశలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకూ ఇంటింటి ఓటరు గుర్తింపు, వత్యాసాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు పరిశీలన , సిఫార్సు, ఓటరు ఫోటో గుర్తింపు, తప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆమేరకు రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ ఓటరు జాబితా ఇంటింటి సర్వే బి ఎల్ వో ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది  ఓటరు జాబితా సమ్మర్ రివిజన్ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.

బూత్ వారీగా పోలింగు ఏజెంట్స్ నియమించడం వల్ల వలస వెళ్లిన వారిని, మరణించిన వారిని, ఒకే పోలింగ్ కేంద్రములో ఆకుటుంబానికి చెందిన వారు ఉండేలా క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమీకృత ఓటరు జాబితా రూపకల్పన అక్టోబరు 1 న ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితా  అక్టోబర్ 19 నుంచి 28 వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. అక్టోబరు 29 మంగళవారం డ్రాఫ్ట్ రోల్ ప్రకటించి, అదే రోజు నుంచి నవంబర్ 28 వరకూ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరించడం జరుగుతుందన్నారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కోసం రెండు శనివారాలు, రెండు ఆదివారాల్లో స్పెషల్ క్యాంపులు  నిర్వహిస్తామని జెసి చిన రాముడు తెలియ చేశారు. డిసెంబర్ 24 లోగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పరిష్కరించి 2025 జనవరి ఒకటవ తరగతి సప్లిమెంటరీ జాబితా తో కూడిన సిద్ధం చేసి జనవరి 5వ తేదీన తుది ఓటర్ జాబితా ప్రకటిస్తామన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ :

తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ చిన రాముడు తెలిపారు. కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ,  తూర్పుగోదావరి ,పశ్చిమగోదావరి,  ఏలూరు,  అల్లూరి సీతారామ రాజు జిల్లాల  కలెక్టర్లను ఉపాధ్యాయ ఓటర్ల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన పై ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఫారం 19 ద్వారా ఓటు హక్కు దరఖాస్తు ఉంటుందన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన డ్రాఫ్ట్ రోల్ సిద్దం చేసి  , సెప్టెంబర్ 24న డ్రాఫ్ట్ రోల్ ప్రకటించడం జరుగుతున్నారు. వాటిపై అభ్యంతరాలను, క్లెయిమ్ లను సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్ 15 వరకు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 30న ఆయా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పరిష్కరించి , నవంబర్ 6న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వారి తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, రాజకీయా పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ ఎన్ . శ్యామ్ రమేష్, సిపిఎమ్ పి. రామకృష్ణ, వైయస్సార్ సిపి ఎస్ .అనిల్ , డిప్యూటీ తహసీల్దార్ గిరీష్ కుమార్ లు హాజరయ్యారు.


SAKSHITHA NEWS