SAKSHITHA NEWS

ఎస్సి వర్గీకరణ చేపట్టాలి

ఎస్సిలను మోసగించిన బిజెపి సర్కారు

  కలెక్టరేట్ ముట్టడి 

జగిత్యాల, మార్చి 31: ప్రతిపక్షంలో ఉండి ఎస్సి వర్గీకరణకు మద్దతిచ్చిన బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చి వర్గీకరణను పక్కనబెట్టి బిజెపి ఎస్సిలను మోసగిస్తోందని ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శుక్రవారం ఎంఎస్పీ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్ ముట్టడిని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం మాట్లాడుతూ గత 28 ఏండ్లుగా మాదిగ జాతి విద్యా, ఉద్యోగ, ఉపాధి తోపాటు వివిధ రంగాల్లో పూర్తిగా వెనుకబాటుకు గురై ఆవేదనతో రోడ్లమీదకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన తెలిపారన్నారు.

అప్పుడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సి వర్గీకరణకు సమర్థించి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వర్గీకరణ చేపడతామని మాటఇచ్చి ఇప్పుడు జాప్యం చేస్తోందన్నారు. బిజెపి కి అనుకూలమైన, ప్రజావ్యతిరేక చట్టాలను పనికట్టుకొని తెస్తున్న బిజెపికి ఐదు నిమిషాల సమయం పట్టని ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంలో చేస్తున్న జాప్యం ఏందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సామాజిక ఉద్యమాలనే చూసిన బీజేపీ పార్టీ మహాజన సోషలిస్టు పార్టీ చేపట్టే జనచైతన్య రాజకీయా యుద్ధం చేస్తామని బిజెపికి రాజకీయా సమాధి కట్టబోతున్నామని దుమాల గంగారాం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి కో కన్వీనర్ బెజ్జంకి సతీష్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీను (జగన్), బలవంతుల సురేష్ ఎమ్మార్పీఎస్ కో కన్వినర్ జగిత్యాల నియోజకవర్గ రాష్ట్ర సీనియర్ నాయకులు మాట్ల బుచ్చన్న, మాదిగ అధ్యక్షులు బోనగిరి కిషన్, అరికిళ్ల సతీష్, మహాజన సోషలిస్ట్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ దీకొండ మహేందర్, లక్ష్మి రాజం, మహాజన సోషలిస్ట్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం జగిత్యాల పట్టణ ఇంచార్జ్ బొల్లారపు దివాకర్, జిల్లా కార్యదర్శి నక్క రాజయ్య, దయ్యాల హన్మంత్, ఎం.ఎస్.పి మెట్పల్లి డివిజన్ ఇన్చార్జ్, ఎమ్మార్పీఎస్
మెట్ పల్లి డివిజన్ ఇంచార్జ్ మోతె సుధాకర్, మల్యాల ఇంచార్జ్ ముప్పారపు స్వామి, బుగ్గారం మండల ఇంచార్జ్ చిర్ర లక్ష్మన్, రాయికల్ మండల్ ఇంచార్జ్ నిగ భూమేష్, మేడిపల్లి మండల్ ఇంచార్జ్ దువాస గంగాధర్, మల్లాపూర్ మండల్ ఇంచార్జ్ నూతిపెల్లి రాజం, ఎంఎస్పి. ధర్మపురి మండల ఇన్చార్జి జిల్లపెల్లి గంగారాం, రత్నాపూర్ సురేష్,సుద్దాల సుద్దాల నాగరాజు రాజం, తెడ్డు రాజం, సుద్దాల చిన్నరాజం, సుద్దాల నిఖిల్, చిట్యాల కరుణాకర్, తెడ్డు రాజం, దొగ్గేలా రాజం, మహేష్, సుమన్ మోహన్, తెడ్డు గంగారాం మహేష్ నరేష్ ప్రవీణ్, లక్ష్మణ్, గంగాధర్, రమేష్, ప్రవీణ్, మహేందర్, మహేష్, నరసయ్య, మల్లయ్య, రాజశేఖర్, గంగారాం పాల్గొన్నారు.


SAKSHITHA NEWS