SAKSHITHA NEWS

స్త్రీలకు విద్య వద్దన్న బ్రాహ్మణులకు కూడా విద్యను నేర్పిన గొప్ప వ్యక్తి సావిత్రి ఫూలే.

భారత దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు,సంఘసంస్కర్త
సావిత్రిబాయ్ పులే జయంతి సందర్బంగా నేడు సిపిఐ,మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంజయ్య నగర్,మక్డుంనగర్ లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమాలకు సిపిఐ శాఖ కార్యదర్శి వెంకటేష్,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు హైమవతి నాయకత్వం వహించగా నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ ముఖ్యాతితీగా పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనుదర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలు కూడా శూద్రులేనని,శూద్రులకు విద్య నిషేధమని అందుకే ఆనాటి సమాజంలో స్త్రీలకు విద్య అందలేదని,సావిత్రిబాయ్ పూలె కి మహాత్మా జ్యోతిభా ఫూలే విద్యను నేర్పించడం వల్ల ఆమె విద్యను అభ్యసించిందని అన్నారు.
విద్య ద్వారా చైతన్యం,జ్ఞానం కలిగి సమానత్వం పొందుతారని, సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకు స్త్రీలకు విద్యను నేర్పించాలని కంకణం కట్టుకొని సొంత అత్తమామలు గృహ,గ్రామ బహిష్కరణ చేసినప్పటికీ వెనుకడుగు వెయ్యకుండా జనవరి 1 న 18 సంవత్సరాల వయస్సులో
మొట్టమొదటి పాఠశాలను స్థాపించి విద్యను అందిస్తుంటే తట్టుకోలేని బ్రాహ్మణులు సావిత్రి బాయ్ ఫూలే మీద పెండ నీళ్లు చల్లడం,రాళ్లతో కొట్టడం లాంటివి చేశారని అయినప్పటికి భయపడకుండా చదువును చెప్పడం వల్ల అనతికాలంలోనే మద్దతు రావడం వల్ల తన జీవిత కాలంలో మొత్తం 32 పాఠశాలలను స్థాపించిందని అన్నారు.

తనను ఇబ్బంది పెట్టిన బ్రాహ్మణ స్త్రీలకు కూడా చదువు చెప్పి చివరికి బ్రాహ్మణ అబ్బాయి ఎశ్వంత ను దత్తత తీసుకొని తన పోరాటం కొనసాగించిదని,చదువు కోసమే కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా,అనాధల కోసం, ప్లెగు వ్యాధి నిర్ములన కోసం పనిచేస్తూ చివరికి ఆ ప్లెగు వ్యాధితో మరణించిందిన్నారు.ఆమె పుస్తకాలను కూడా రాశారని, సత్య శోధక సమాజ్ బాధ్యతలు కూడా నిర్వహించిన గొప్ప పోరాట యోధురాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా నేడు మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవాన్ని జరపడం శుభాపరిణామని,కావున స్త్రీలు నేడు సావిత్రిభాయ్ ఫూలే ని స్ఫూర్తిగా తీసుకొంటే బ్రాహ్మనిజం ఎలాంటి ఆంక్షలు పెట్టిందో తెలుస్తుందని, వాటి నుండి బయటపడితే మరింత చైతన్యవంతులై రానిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,ఉపాధ్యక్షుడు రాములు, మహిళా సమాఖ్య నాయకులు అనిత,భాగ్యమ్మ,మహేశ్వరి,చంద్రకల,గోవిందమ్మ, రేణుక,నిర్మల, లియోనా,కృష్ణవేణి,సరిత,సిపిఐ నాయకులు బాబు,శ్రీకాంత్,రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS