SAKSHITHA NEWS

గ్రూప్ -1 పరీక్ష రద్దుతో ఒత్తిడికి లోనైన వికలాంగ నిరుద్యోగ యువతికి మాజీ ఎంపీ చేయూత

రూ. 25వేలు ఆర్థిక సాయం

నిరుద్యోగులందరికీ అండగా ఉంటానని హామీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

హామీ ఇవ్వడమే కాదు… ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పొంగులేటికి ఎవరూ సరిలేరనేది మరోమారు నిరూపితమైంది. ఇటీవల జరుగుతున్న వరుస ఆత్మీయ సమ్మేళనాలతో పాటు రైట్ ఛాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో పలుమార్లు నిర్వహించిన నిరుద్యోగ యువత అవగాహన సదస్సుల్లోనూ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన నిరుద్యోగ యువతీ, యువకులకు అండగా ఉంటానని చెబుతూ వస్తున్నారు. చెప్పడమే కాదు తాజాగా అది నిజమని నిరూపించి చూపించారు. భద్రాచలానికి చెందిన భవానీ అనే వికలాంగ నిరుద్యోగ యువతి ఇటీవల గ్రూప్ -1 పరీక్ష రాసింది. పేపరు లీకేజీ వ్యవహారం కారణంగా ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో సదరు వికలాంగ యువతీ ఒత్తిడికి లోనైంది. నెలలు తరబడి కష్టపడి చదివి రాసిన పరీక్షను రద్దుచేయడంతో తనకు ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదేమోనని… కుటుంబానికి అండగా ఉండలేనేమోనని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం రాత్రి నేరుగా ఆ యువతి ఇంటికి వెళ్లారు.

తనకి తన కుటంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.25 వేలను అందజేసి ఆ యువతిలో మనోధైర్యం నింపారు. తనకే కాదు… తన లాంటి వేలాది మంది నిరుద్యోగులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోమారు నిరుద్యోగ యువతీ, యువకులకు పొంగులేటి భరోసా ఇచ్చారు.


SAKSHITHA NEWS