సారా బట్టి పై పోలీసులు దాడి
-30 లీటర్ల సారా స్వాధీనం,2100 బెల్లపూట ధ్వంసం
కాకినాడ, సాక్షిత :
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రప్పాలెం రోడ్డులో అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్సై టి రఘునాథరావు వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ఎస్సై తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.సారా తయారు చేస్తున్న భట్టిపై దాడి చేసి, 30 లీటర్ల లైవ్ సారాను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా 17 డ్రమ్ములలో నిల్వ ఉంచిన బెల్లపు ఉటను ధ్వంసం చేశారు.
అక్రమ సారా తయారీకి పాల్పడుతున్న జియన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. జగ్గంపేట మండల పరిధిలో అక్రమంగా సారా తయారుచేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల పై అధికారుల ఆదేశాల మేరకు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై రఘునాధ రావు హెచ్చరించారు.