SAKSHITHA NEWS

ఉయ్యూరు

తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరం కలిసికట్టుగా సంక్రాంతి పండగ చేసుకుందాం – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.

ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం (బాబు)వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని గంగిరెద్దుల కోలాహలం, వరి కోత, రేగిపండ్లతో పిల్లలపై భోగిపండ్లు పోయడం ఇలా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు కార్యక్రమాలు ప్రారంభించిన రాజేంద్రప్రసాద్ .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటని, సంక్రాంతి పండగ అనేది మన సాంప్రదాయాల్ని, సాంస్కృతిని కాపాడుకునే పండుగని, అలాంటి పండుగ విశిష్టత పిల్లలకి తెలియపరిచే విధంగా ప్రతి సంవత్సరం ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు చాలా చక్కగా కోలాటం మరియు పండుగ జరుపుకునే విధానం పిల్లలకు నేర్పించడం ద్వారా మనం వారికి మంచి విద్య అందించడమే కాకుండా మన సాంప్రదాయాల్ని కూడా నేర్పిన వారమవుతామని, దానికి ప్రత్యేకంగా ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ పాల్గొన్నారు.