SAKSHITHA NEWS

స్వాతంత్ర పోరాటంలో వడ్డే *ఓబన్న పోరాటం వీరోచిత్తమ
భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్న

*సాక్షిత వనపర్తి :
స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.

     వడ్డె ఓబన్న జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో  బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వడ్డే ఓబన్న  చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. వడ్డెర లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. 

   స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని, ఓబన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. 

   కార్యక్రమంలో పురపాలక  చైర్మన్ పుట్టపాకుల మహేష్, వడ్డెరల సంఘం జిల్లా నాయకులు దాసర్ల భూమయ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వడ్డెర సంఘం నాయకులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.