విశ్వ గురువుగా విలసిల్లి ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీరామరక్ష అని ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల కన్వీనర్ నాగవెల్లి ప్రభాకర్ అన్నారు. దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో శుక్రవారం నాడు జరిగిన ఆధ్యాత్మిక,వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ మహోన్నతమైన సనాతన ధర్మ గొప్పతనాన్ని బాలలకు చిన్నతనం నుండే బోదించడం ద్వారా వారిని సనాతన ధర్మానికి నిజమైన వారసులుగా తయారు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న భగవద్గీత,హనుమాన్ చాలీసా, నీతి పద్యాలు,దేశభక్తి గీతాలు,భజన కీర్తనలు ఆలపించారు.యోగాసనాలు,సాహస కృత్యాలు,శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రతిభా పరీక్షలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణా తరగతుల కన్వీనర్ పర్వతం శ్రీధర్ కుమార్, మొరిశెట్టి రామ్మూర్తి,అప్పం శ్రీనివాస్, నాగవెళ్లి దశరథ, రాగి భాస్కరా చారి,పోలా వీరభద్రమ్,మునగాల సుదర్శన్,సత్యవతి, ప్రశాంతి,శ్రీలత,సంధ్యారాణితో పాటు వంద మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.