సేల్స్ ఫోర్స్ సంస్థ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో 124 డివిజన్ పరిధిలోని JNNURM జయశంకర్ నగర్

సేల్స్ ఫోర్స్ సంస్థ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో 124 డివిజన్ పరిధిలోని JNNURM జయశంకర్ నగర్

SAKSHITHA NEWS

సేల్స్ ఫోర్స్ సంస్థ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో 124 డివిజన్ పరిధిలోని JNNURM జయశంకర్ నగర్ లో గల కార్యాలయంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సంస్థ మానేజర్ కందూరి రాములు తో కలిసి 118 మంది పేద విద్యార్థులకు స్కూల్ బాగ్ కిట్స్ అందజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సంస్థ ఎల్లమ్మబండ లో వేలమంది పేద వారికి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ.. స్కూల్ బాగ్ కిట్స్ కి ఆర్థికంగా సహకరించిన సేల్స్ ఫోర్స్ సంస్థను మరియు ఉమ్మెద్ శ్రీనివాస్, రూబరొ రిషి ను అభినందించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు కరీమ్, రిపోర్టర్ బుల్లెట్ రవి, జాన్, రాములు గౌడ్, వాసుదేవ రావు, ఇంత్యాజ్, పోశెట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS