SAKSHITHA NEWS

RTC నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు

*సాక్షిత వనపర్తి
ఆర్టీసీస్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి డిపో కార్మికులు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగాఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజనల్ ప్రచార కార్యదర్శి క్రాంతి కుమార్ వనపర్తి డిపో ఎస్ డబ్ల్యూ ఎఫ్ కార్యదర్శి ఏ కృష్ణయ్య లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని ఆర్టీసీకి బడ్జెట్లో రెండు శాతం కేటాయించాలని హెయిర్ పెన్షన్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని కనీస వేతనం 26,000 గా నిర్ణయించాలని ఎన్ వి యాక్ట్ 2019 ను సవరించి ఆర్టీసీ సంస్థను రక్షించాలని తదితర న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వనపర్తి డిపో అధ్యక్షులు జీవీ స్వామి రీజనల్ నాయకులు ఎండి ఖయ్యూం సహాయ కార్యదర్శి గోవర్ధన్ కే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RTC

SAKSHITHA NEWS