ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు.
సాక్షిత : చంద్రన్నకి, పవనన్న కి, ముస్లిం సోదరులు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు
ముల్లా మున్వర్ బాషా
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారినిరూపించింది.చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూరదృష్టి, సమానత్వ నిబద్ధత వల్లే ముస్లింల అభివృద్ధిజరుగుతుంది.ముస్లింలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూపిన చిత్తశుద్ధికి ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తుంది.మంత్రి ఫరూక్ కు,ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన “ముల్లా మునూర్ భాష జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి” అనంతరం వారు మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో తొంభై కోట్లు విడుదల చేస్తూ, ఇమామ్, మౌజన్ లకు నెలకు రూ.15,000 చొప్పున గౌరవ వేతనాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
