వడ్డీ లేకుండా మహిళలకు రూ. 5 లక్షల లోన్
కేంద్ర ప్రభుత్వం “లక్ పతి దీదీ” పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళ ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తోంది. వివిధ వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలు (డోక్రా)లో సభ్యులుగా ఉండి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు దీనికి అర్హులు. ఈ స్కీమ్ లో వడ్డీ లేకుండా రూ. 5 లక్షల లోన్ పొందొచ్చు. అవసరమైన పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీనికి అప్లై చేసుకోవాలి.