సాక్షిత : ఈ తప్పు అంగన్వాడి కేంద్రాలదా లేక కాంట్రాక్టర్ల దా
వారిపై చర్యలకు బాధితుల డిమాండ్…!
నిద్ర నీడలో మండల అధికారులు గర్భిణీ స్త్రీల బాలింత తల్లుల చంటి బిడ్డల ఆరోగ్యాలతో చెలగాటమా..!
శ్రీశైల మండలం :నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింత తల్లులకు పంపిణి చేసిన కోడి గుడ్లు కుళ్ళిపోయాయి భయంకరమైన దుర్వాసన వస్తుండడంతో బాధితులు పత్రికా విలేకరులకు ఫిర్యాదు చేశారు నిత్యం ఏదో ఒకచోట మండల కేంద్రంలో కుళ్లిన గుడ్లు బయటపడుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లను సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ఓ ఏజెన్సీకి గుడ్లు సరఫరా బాధ్యతను అధికారులు అప్పగించారు. ఫౌలీ్ట్రల నుంచి నాణ్యమైన గుడ్లును సేకరించి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరాచేయాలి. కానీ ఏజెన్సీ నిర్వాహకులు చిన్నపాటి, నాసిరకం గుడ్లను తక్కువ ధరకు కొనుగోలుచేసి అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి శ్రీశైలం మండలం పరిధిలో సుమారు 31 శ్రీశైలం,సున్నిపెంట,లింగాల గట్టు, గ్రామంలో అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయి అయితే ఈ నెల ఇచ్చిన కోడిగుడ్లు లలో సగం గుడ్లు కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది బాధ్యతలు ఆరోపిస్తున్నారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది మండలంలో కొందరికి ఇచ్చిన గుడ్లు పగులగొట్టగా కుళ్లిన వాసన వచ్చాయని దీంతో బాధితులు ఆరా తీయగా టీచర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడి కేంద్రంలో నాణ్యతలేని కోడిగుడ్లు పంపిణీ చేస్తూ పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై మరియు కోడిగుడ్డును పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా టీచర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా సంఘాల నాయకులు జిల్లా అధికారులను కోరుతున్నారు