సాక్షిత, : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్ (RP) కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు బాపులే , డాక్టర్ BR అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను జాతీయ దళిత సేన చైర్మన్ శ్రీ డా. జె. బి. రాజు , ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింత కింది కాశిం , జగద్గిరి గుట్ట CI సైదులు , కార్పొరేటర్ శ్రీమతి రోజా దేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు బాపులే , డాక్టర్ BR అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, దేశం కోసం పాటుపడిన మహనీయులను స్మరించుకోవడం మన విధి అని,దేశం కోసం ,సమాజ హితం కోసం ఎన్నో సేవలు చేసిన మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని , బావి తరాలకు స్ఫూర్తి ప్రధాతలు అని, వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని, వారి అడుగు జడలలో ప్రతి ఒక్కరు నడవాలి అని , వారి ఆశయాలను కొనసాగించాలని, ప్రతీ ఒక్కరు స్ఫూర్తి ప్రధాతలను ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగుతూ సమాజ హితం పాటుపడలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా
చందానగర్ లో నా స్వంత డబ్బుల తో అంబెడ్కర్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగినది అని, ఎల్లమ్మబండ మహంకాళి నగర్ మరియు PJR నగర్ లలో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగినది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థులు మంచి చదువులు చదువుకోవాలని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని,దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని , ఈ సంవత్సరంలో 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధావుడు అని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు అని ,దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలు లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మన శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకం అమలు లో భాగంగా 100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం కింద అమలు చేశామని, వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక ,సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపినవారు అవుతామని, వారి కాలి పై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుంది అని , దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కుల పెద్ద భాస్కర్ రావు , బాబురావు, లింగయ్య, హరినాథ్, రాంచందర్, చంద్రమౌళి, డ్రైవర్ బాబు, పెంటమ్మ ,సంగి విజయ, రాధాబాయి, సంధ్య ,స్వరూప, వెంకన్న, ప్రవీణ్, దేవదాసు, గిరిబాబు, భాస్కర్, అంజయ్య,పర్శరాములు బాబు, యాకుబ్, చంద్రయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు