SAKSHITHA NEWS

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి.

శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాదులో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ట్రాన్స్పోర్ట్ భవన్ లో ఏ ఎం వి ఐ నియామక పత్రాన్ని అందుకున్న శంకర్పల్లి, హనుమాన్ నగర్ కి చెందిన మాల బాలయ్య కుమారుడు మాల కిరణ్ కుమార్ కు, తల్లిదండ్రులు మాల బాలయ్య,విజయలలిత, కుటుంబ సభ్యులు రమ్య, శ్రీధర్ బంధుమిత్రులు పెంటయ్య,శంకరయ్య, మర్పల్లి అశోక్,నర్సింలు, రాములు,శంకర్పల్లి మాజీ ఎంపీపీ నర్సింహులు, మాజీ సర్పంచ్ బిసోల్ల శ్రీధర్,స్నేహితులు మరియు కాలనీవాసులు అభినందనలు తెలియజేశారు.గత నెలలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియామకమై మేడ్చల్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ, మళ్లీ నెల రోజుల వ్యవధిలోనే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా మరో ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తపరుస్తూ,తన బిడ్డ పట్టుదలకు,శ్రమకు, వినయ,విధేయతలకు ఎంతగానో గర్వపడుతూ బంధుమిత్రులతో వారి సంతోషాన్ని పంచుకున్నారు

WhatsApp Image 2024 11 11 at 6.53.38 PM

SAKSHITHA NEWS