
మున్సిపల్ పాఠశాలలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె సుధ జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏడవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చెమిటిగంటి పార్వతి దేవి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఆ మహనీయుల వ్యక్తిత్వాలను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరారు.విద్యార్థులుగా మంచి భావిభారత పౌరులుగా తయారై భారతదేశo గర్వించదగ్గ వ్యక్తులుగా తయారవ్వాలని అప్పుడే మనము వారికి ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత విద్యను అభ్యసించి మంచి మంచి స్థానాల్లో ఉండి మీ యొక్క తల్లిదండ్రులను మీ పాఠశాల ఉపాధ్యాయులను మీ గ్రామాన్ని మన దేశo కూడా గర్వించేలా ఎదగాలని కోరారు. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు అనంతరంవిద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఎన్ అంజమ్మ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app