
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్ ఎగురవేయడం జరిగింది. స్థానిక B.R.I.G పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆలపించారు. అలాగే మరికొంత మంది విద్యార్థినులు దేశ భక్తి గీతాలను ఆలపించారు.అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వారికి స్వీట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు రిపబ్లిక్ దినోత్సవ విశిష్టతను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app