SAKSHITHA NEWS

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడం పట్ల రంగన్నగూడెం గ్రామ ప్రముఖులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరధ రామయ్య తదితరులు అభినందనలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు రంగన్నగూడెంలో మాట్లాడుతూ ప్రాథమిక దశ నుంచి మెరిట్ విద్యార్థి అయిన పుసులూరు రవికిరణ్ 2019లో మెరుగైన ర్యాంకు సాధించి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐ.సి.ఎల్.ఎస్) కు ఎంపికై ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గా పనిచేస్తున్నారని మంచి ఉద్యోగం వచ్చినాకూడా ఐ.ఏ.ఎస్, ఐ.ఆర్.ఎస్ కావాలనే తన లక్ష్యానికి అనుగుణంగా ఆ తర్వాత సంవత్సరాలలో కూడా సివిల్స్ రాస్తూ తాజా ఫలితాల్లో 694వ ర్యాంకు సాధించడం కృష్ణా జిల్లాకే గర్వకారణం అన్నారు. మొదటినుంచి రవి కిరణ్ కు రంగన్నగూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ(అర్.అర్. డీ. ఏస్) నుంచి సలహాలు,సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని, యువకులకు ఐఏఎస్ శిక్షణ కొరకు గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2014లో ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ విద్యాదీవేన పథకానికి ఎంపికై ఢిల్లీలో రవికిరణ్ శిక్షణ పొందారని, రవికిరణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానం సాధించి రంగన్నగూడెం గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS