రామోజీరావు ….తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పిన సంపాద‌కుడు

రామోజీరావు ….తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పిన సంపాద‌కుడు

SAKSHITHA NEWS

Ramoji Rao ....the editor who made a turning point in Telugu journalism

రామోజీరావు ….తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పిన సంపాద‌కుడు
*నివాళుల‌ర్పించిన‌ ఎం.పి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

  • కుటుంబ సభ్యులను పరామర్శించిన చిన్ని

విజ‌య‌వాడ : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ….తెలుగునాట ఈనాడు దినపత్రికను స్థాపించి.. తెలుగు ప‌త్రికా రంగాన్ని మ‌లుపు తిప్పిన సంపాద‌కుడు చెరుకూరి రామోజీరావు అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్మ‌రించుకున్నారు. తెలుగుప్రజల్లో దినపత్రికల పట్ల ఆసక్తిని, అభిరుచులను పెంపొందించడంలో రామోజీరావు విశేషమైన కృషి చేశాడ‌ని కొనియాడారు. సోమ‌వారం రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఇటీవల దివంగతులైన రామోజీరావు చిత్ర ప‌టం వ‌ద్ద‌ కేశినేని శివ నాథ్ నివాళులర్పించారు.రామోజీరావు త‌న‌యుడు ఈనాడు ఎండి కిర‌ణ్ తో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు లేని లోటు పత్రికా రంగానికే కాదు, తెలుగు సాంస్కృతిక రంగానికి తీరని వెలితిగా భావిస్తున్న‌ట్లు కేశినేని శివ‌నాథ్ తెలియ‌ప‌ర్చారు.


SAKSHITHA NEWS