రామగుండం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి…
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో భేటీ.. పెండింగ్ పనులపై సమీక్ష….
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, : రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై జిల్లా కలెక్టర్‌తో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, రోడ్లు–భవనాల శాఖ, రహదారి అభివృద్ధి సంస్థ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రహదారుల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులను కోరారు.
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
