ఉత్తమ ఆర్డీవో సూర్యనారాయణకు ఘన సన్మానం………………………..
..*విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ళ సీతారామయ్య..
సాక్షిత : నిజాయితీ గల ఉద్యోగికి నిత్యాదరణ.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఎప్పుడూ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ళ సీతారామయ్య ఆదరణ ఉంటుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. కోదాడ ఆర్డీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా ‘ఉత్తమ ఆర్డీవో’ అవార్డు అందుకున్న సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సూర్యనారాయణ వంటి నిజాయితీ గల అధికారులు వ్యవస్థకు గర్వకారణమని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి అవార్డు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వారు మరిన్ని ఉన్నతమైన పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘు వర ప్రసాద్ ,ఆర్ధిక కార్యదర్శి వీరబాబు, సీనియర్ సిటిజెన్ అధ్యక్షులు గడ్డం నర్సయ్య , పొట్టా జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
