జగద్గిరిగుట్టలో ప్రభుత్వ భూములను కాపాడండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ డివిజన్లోని జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సంబంధించి భూములలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే అడ్డుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని నేడు కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఆర్ ఐ కరీముల్లా గారికి సిపిఐ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కుత్బుల్లాపూర్ మండలంలో హైడ్రాధికారులు వచ్చి హెచ్చరించినప్పటికీ అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అధికారులు కబ్జాలు చేస్తున్న వారి పేర్లు తెలిసినప్పటికీ వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ మళ్లీ కబ్జాలు చేసుకుంటూ ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని సిపిఐ గా ఇచ్చిన ప్రభుత్వ భూములను కాపాడాలని లేనిపక్షంలో వచ్చే వారం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మండల కోశాధికారి సదానంద్ సిపిఐ నాయకులు ఇమామ్, వంశీ తదితరులు పాల్గొనడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
