SAKSHITHA NEWS

రాజీవ్ యువవికాసం దరఖాస్తుల తిరస్కరణ

పథకం ప్రారంభం కాకముందే అనేక ఆటంకాలు

ఆన్లైన్ సెంటర్లు, మీసేవ కేంద్రాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదంటున్న నిరుద్యోగులు

ఆధార్ కార్డుతో నమోదు చేసుకోగానే “ఆల్రెడీ అప్లైడ్” అని చూపిస్తూ, దరఖాస్తులు తిరస్కరిస్తున్న రాజీవ్ యువవికాసం వెబ్సైట్

ఏప్రిల్ 5వ తారీఖు వరకే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు

2017-18లో స్వయం ఉపాధి కోసం నమోదు చేసుకున్న వారి వివరాలు అధికారులు తొలగించడంతోనే ఈ సమస్య వచ్చిందంటున్న నిరుద్యోగులు

ఏప్రిల్ 6 నుండి మే 30 వ తేది వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి, జూన్ 2 నుండి జూన్ 9వ తేది వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు

ఎన్నిసార్లు ప్రయత్నించినా వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించడం లేదని, మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తిపోయామని, అధికారులు వెంటనే వెబ్సైట్ లోని లోపాలను సరిచేసి దరఖాస్తులు తిరస్కరించకుండా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు