SAKSHITHA NEWS

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గృహకల్ప లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గృహకల్ప లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం,ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాంబాశివా రెడ్డి, దశరథ్, బిక్షపతి, ముత్యాలు,శివ, నాగ శ్రీనివాస్,
వెంకట స్వామి, మహిళా నాయకులు స్వర్ణ కుమారి, సరస్వతి, మని, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS