రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలనలో లోపాలను గుర్తు చేసినా, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించినా.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించినా కేసులు పెడుతున్నారు. కూల్చుతున్న ఇళ్లకు అడ్డొచ్చినా.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తున్నారు. సూట్కేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు, మా నాయకులు హరీశ్ రావు , జగదీశ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టు అప్రజాస్వామికం. తక్షణం వారిని విడుదల చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు
Related Posts
సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం
SAKSHITHA NEWS సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం సూర్యాపేట లో సుధా బ్యాంక్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా శుక్రవారం సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్…
రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు.
SAKSHITHA NEWS రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు? అంత అన్నాం. ఇంత అన్నాం. ఎంతో గొప్పగా ఓ డేట్ కూడా అనౌన్స్ చేశాం. టైమ్ దగ్గర పడుతోంది. ఇంకో 9 రోజులే ఉంది.…