రెండు తెలుగురాష్ట్రాలలో కురువనున్న వర్షాలు
ఈరోజు నుండి మే నెల మొదటివారం 5, 6 తేదీల వరకు కొనసాగనునున్న అకాల-వర్షాలు
నిన్నటి నుండి ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు మిగిలిన తెలంగాణ హైదరాబాద్ సహా కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
హైదరాబాద్ సహా కోస్తాంధ్ర విజయవాడ అమరావతి సహా రాయలసీమ జిల్లాల్లో మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేళల్లో చాలాచోట్ల గాలి-దుమారాలు మరియు ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్నిచోట్ల పిడుగులు మరియు వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 22,23,24 మరియు 27,28,29 & మే 1,2,3 తేదీలలో ఈ తేదీలలో రెండు తెలుగురాష్ట్రాలలోని తెలంగాణ, కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలో ఈ అకాల-వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.
వాతావరణ పొరల్లో కలిగే తీవ్రమైన అనిశ్ఛితి కారణంగా ఈ వర్షాలు కురిసే సమయంలో కొన్నిచోట్ల గాలులు వేగం ఎక్కువగా ఉండి చెట్లు కూలడం చెట్లు కొమ్మలు విరిగే అవకాశం ఉండటం…..అలాగే కొన్నిచోట్ల పిడుగులు మరియు వడగళ్ళుకురిసే అవకాశం ఉండటం వల్ల, ఆ సమయంలో ఆరుబయట ఉన్నవారు తగిన-జాగ్రత్తలు తీసుకోవాలనివాతావరణ శాఖ సూచించింది…