SAKSHITHA NEWS

Rahul Gandhi is a man of the people..

రాహుల్ గాంధీ ప్రజల మనిషి..
నిరంతరం ప్రజల పక్షాన ఆయన పోరాటం…
మంత్రి కొండా సురేఖ…
రాహుల్ నాయకత్వంలోనే ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు: నీలం మధు…
పటాన్ చెరు లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు…
పుట్టిన పిల్లలకు రూ.10000..
రాహుల్ జన్మదిన సందర్భంగా నీలం మధు వినూత్న కార్యక్రమం..
జూన్ 19న పుట్టిన పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్…
రోగులకి పండ్ల పంపిణీ…
పాల్గొన్న డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్..

రాహుల్ గాంధీ ప్రజల మనిషని, బీజేపీ అరాచక పాలనను ఎండగడుతూ అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరువు పట్టణ అధ్యక్షులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నీలం మధు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ జన్మదినమైన జూన్ 19న పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జన్మించిన పిల్లలకు ఒక్కొక్కరికి రూ. పదివేల ను ప్రకటించారు. బుధవారం జన్మించిన ఒక మగ బిడ్డకు మంత్రి సురేఖ చేతుల మీదుగా పదివేల రూపాయల చెక్కును అందజేశారు. రాహుల్ జన్మదిన సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం పట్ల నీలం మధును మంత్రి కొండా సురేఖ అభినందించారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ భారత దేశ ఉజ్వల భవిష్యత్తుకు రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమన్నారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగి భారత్ ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల అందరిని ఏకం చేసి వారి మనసులను గెలుచుకున్న ఘనత రాహుల్ కి దక్కుతుందన్నారు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ దేనని అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన రాహుల్ గాంధీ భవిష్యత్తులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ఏ లక్ష్యంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో కలిసి కాంగ్రెస్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా సైనికుల వలె కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్, చంద్రారెడ్డి,సదర్ మల్లేష్, యూసుఫ్,గుండ్ల మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మండలాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 19 at 13.31.05

SAKSHITHA NEWS