SAKSHITHA NEWS

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.
*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షించారు.

ఎవరి పరిధిలో ఏ ఏ పనులు జరుగుతున్నాయి, ఎంత మేర అయ్యాయి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు అవసరమైన అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు, డ్రెయినేజీ కాలువలు, సి.సి.రోడ్లు వేగంగా చేయాలన్నారు. వర్షాలు పడుతున్న తరుణంలో మురుగునీటి కాలువల్లో ఎక్కడా చెత్త పేరుకు పోకుండా, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.

అందరూ అధికారులు సమన్వయ పరుచుకుని నగర అభివృద్దే ధ్యేయంగా పనులు చేయాలని అన్నారు. మీకు కేటాయించిన పనులు పలు మార్లు తనిఖీ వేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, డి. ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, నరేంద్ర తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS