SAKSHITHA NEWS

నాణ్యమైన విద్య బోధన అందించాలి

గద్వాల: విద్యార్థులు మంచి మార్కులు సాధించే విధంగా నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ఆదేశించారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని టి.జి. రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజీ (బాలుర) ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను, హాస్టల్, మెస్ తదితర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా ముచ్చటించి, సబ్జెక్టుల వారిగా వారి విద్యాసామర్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సంవత్సరం మంచి మార్కులు సాధించడంతో పాటు ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని అన్నారు. విద్యార్థులకు పాఠాలు స్పష్టంగా, అర్థమయ్యే విధంగా బోధించాలని, తద్వారా వారు సులభంగా అర్థం చేసుకుని మంచి ఫలితాలు సాధించగలుగుతారని అన్నారు.

ప్రతి విద్యార్థి యూనిఫామ్ లో ఉండాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ వారి విద్యాసామర్ధ్యాన్ని వర్శీలిస్తు ఉండాలన్నరు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం చాలా అవసరమని, అందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టిక ఆహారం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాలలో విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ, పాఠశాల ఫలితాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు,
తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS