SAKSHITHA NEWS

ఉగ్రన్న యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన పువ్వాడి

సాక్షిత కనిగిరి

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్రన్న యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంటును పామూరు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.మొదటి బహుమతి టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు 50, 116, ద్వితీయ బహుమతి ఎల్ ఎన్ పురం ఎంపీటీసీ బొల్లా నరసింహారావు 35,116, తృతీయ బహుమతి శ్రీ బాలాజీ జ్యువెలర్స్ ప్రోప్రైటర్ అల్లు శ్రీనివాసులు 20,116 రూపాయలు, స్పోర్ట్స్ కిట్ ను ప్రముఖ వ్యాపారవేత్త యారవ శ్రీనివాసులు, టోర్నమెంట్ షీల్డ్ షేక్ ఖాజా రహంతుల్లా, ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ ఆర్ఆర్ రఫీ, మ్యాన్ ఆఫ్ ది సీరియస్ మోబినా మౌలాలి బహుమతులను ప్రకటించారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో యారవ శ్రీనివాసులు, దేవరపు మాల్యాద్రి, షేక్ ఖాజా రహమతుల్లా, పందిటి హరీష్, మెంటా నరసింహారావు, జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు యలమందల రహీముల్లా, జనసేన మండల నాయకులు షేక్ సందాని, తదితర టిడిపి శ్రేణులు, క్రికెట్ టీమ్స్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS