చిలకలూరిపేట పురపాలక సంఘం నందు గల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) విభాగం ఆధ్వర్యంలో పట్టణం నందు గల ప్లంబర్స్, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్, టీవీ మెకానిక్, బ్యూటీషియన్ తో పాటు ఇతర అన్నిరకాల సేవలు అందించు వారికి హోమ్ ట్రయాంగిల్ ప్లాట్ ఫాం ద్వారా జీవనోపాధి కల్పించుటలో భాగంగా ది: 10-01-2025 తేదీన ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి మరియు స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులచే మునిసిపల్ కౌన్సిల్ హాల్ నందు సర్వీసు ప్రొవైడర్ల గుర్తింపు మేళా కార్యక్రమం ప్రారంభించబడును.
కావున పట్టణం నందు గల ప్లంబర్స్, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, వాటర్ ప్యురిఫైయర్, గీజర్, టీవీ మెకానిక్, బ్యూటీషియన్ తో పాటు ఇతర అన్నిరకాల సేవలు అందించువారు ఈ కార్యక్రమానికి హాజరై రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, పాన్ కార్డ్ జిరాక్సులతో వివరాలను నమోదు చేసుకోవాలని మునిసిపల్ కమీషనర్ పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) విభాగం
Related Posts
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు
SAKSHITHA NEWS ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు! ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.…
ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాల కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
SAKSHITHA NEWS అమరావతి తే.17–01–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార…