18 వ వార్డులో సిపిఎం కౌన్సిల్ అభ్యర్థి ప్రచారం నిర్వహించిన పుట్ట ఆంజనేయులు
సాక్షిత వనపర్తి ఫిబ్రవరి 2
వనపర్తి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా18 వ వార్డు బిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గంధం మదన్, 21 వ వార్డు బి ఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి పుట్ట ఆంజనేయులు ను గెలిపించాలని బిఆర్ఎస్ సిపిఎం నాయకులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ 18 వ వార్డు అభ్యర్థి గంధం మదన్ 21 వ వార్డు అభ్యర్థి పుట్ట ఆంజనేయులు గుర్తులు సుత్తి, కొడవలి, చుక్క గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు.
18 వ వార్డు, 21 వ వార్డు కౌన్సిలర్లుగా సిపిఎం గెలిస్తే మారెమ్మ కుంట స్థలంలో అంబేద్కర్ కళాభవన్ నిర్మిస్తామని,అంబేద్కర్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని,పార్కు ఏర్పాటు చేస్తామని, కందకములో మార్కెట్ యార్డును పూర్తిగా నిర్మించి వినియోగంలోకి తెస్తామని,దళితులకు స్మశాన స్థలం లేదు కాబట్టి ప్రభుత్వ చట్ట ప్రకారమే రెండు ఎకరాల భూమి ఇవ్వాలని ఉన్నది. దాని ప్రకారము స్మశాన స్థలం పోరాడి సాధిస్తామని,తలనీలాలకు స్థలం కేటాయించే విధంగా పోరాడతామని,వార్డులో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి బాల్ రెడ్డి, ఏ. లక్ష్మి, గోపాల్ దీన్నే సిపిఎం సర్పంచు కవిత
బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ దానీల్, మంద రాము, గోర్ల బాలయ్య, సిపిఎం వార్డుల నాయకులు డి కురుమయ్య, గంధం గట్టయ్య, జి మన్యం, డి శ్రీను, బి కురుమయ్య, సాయి లీల,రేణుక, సి పుల్లయ్య, జి కళ్యాణ్, కోసిక స్వామి తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
