సెక్యూరిటీ గార్డు లకు టార్చిలైట్లు, ఫైబర్ లాఠీలు అందజేసిన అర్జీ వన్ జి.ఎం.లలిత్ కుమార్.
సాక్షిత పెద్దపల్లి : సింగరేణి ఆర్జీ వన్ ఎస్ అండ్ పి సి డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు లకు టార్చిలైట్లు, ఫైబర్ లాఠీలు అర్జీ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అందజేశారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అర్జీ వన్ ఎస్ అండ్ పి సి డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకట్ స్వామి పేర్కొన్నారు.
అర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రెడ్డి వెంకట్ స్వామి మాట్లాడుతూ.. గత కొన్ని నెలల క్రితం అర్జీ వన్ చెక్ పోస్ట్ లలో ఆధునిక వసతులు కల్పించాలని, ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ గార్డు లకు టార్చిలైట్లు, ఫైబర్ లాఠీలు, డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన మేరకు యాజమాన్యం స్పందించి, వాటిని అమలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చెక్ పోస్ట్ లలో ఫర్నిచర్ ఏర్పాటు తో పాటు సెక్యూరిటీ గార్డు లకు టార్చిలైట్లు ఫైబర్ లాఠీలు అందజేసిన అర్జీ వన్ జనరల్ మేనేజర్ కు ఏఐటియుసి పక్షాన, సిబ్బంది తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి పక్షాన ఎప్పటికప్పుడు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంగా, వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్న వీరారెడ్డి కి కూడా సిబ్బంది పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ లు చంద శ్రీనివాస్, మహ్మద్ అక్బర్ అలీ, జమెదార్లు బి.తిరుపతి , మురళి కృష్ణ , బోయిన.ఓదెలు ,శ్రీనివాస్, మొండయ్య, కె.సదానందం, ఇంటెలిజెన్స్ టీం రాధాకృష్ణ, మధు, తిరుపతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
