మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే….
సాక్షిత : చిలుకూరు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీయుత మధిర ప్రీతి రెడ్డి , వైస్ చైర్మన్ మధిర గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకు చదువుపరంగా తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని విద్యార్థులు అందరూ ఐక్యమత్యంతో ఉండాలని కళాశాలలో డిజిటల్ లైబ్రరీ , ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ , జూనియర్ అన్న తేడా లేకుండా ఉండాలని నిరంతరం కష్టపడుతూ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని కళాశాల ప్రిన్సిపల్ ఎస్. నర్సిరెడ్డి తెలిపారు .ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY